Samanulevaru Prabho / సమానులెవరు ప్రభో (Indian Classical)

👤 Sireesha Bhagavathula

🌐 Language: Telugu

🙏 Context: Praise & Worship

సమానులెవరు ప్రభో
నీ సమానులెవరు ప్రభో (2)
సమానులెవరు ప్రభో
సమస్త మానవ శ్రమాను భవమును (2)
సహించి వహించి ప్రేమించగల (నీ) (2)

సమాన తత్వము – సహోదరత్వము (2)
సమంజసము గాను మాకు దెలుప (నీ) (2)

దయా హృదయ యీ – దురాత్మ లెల్లరున్ (2)
నయాన భయాన దయాన బ్రోవ (నీ) (2)

ఓ పావనాత్ముడ – ఓ పుణ్య శీలుడ (2)
పాపాత్ములను బ్రోవ – పరమాత్మ సుత (నీ) (2)

©2026 Exalt Him Ministries 

Log in with your credentials

Forgot your details?