Sarvaloka Prabhuvunaku || సర్వలోక ప్రభువునకు
👤 Shweta Mohan
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
సర్వలోక ప్రభువునకు! సంపూర్ణ జయము
సర్వలోక ప్రభువు గనుక! నిశ్చయమైన జయము
తనపోలికను నరునిచేసిన! తండ్రికి జయము
తానుద్దేశించినది నిష్ఫలముకాని! తండ్రికి జయము
నరులలో గుడారమువేసిన! తండ్రికి జయము
అందరిని ఆకర్షించు! తండ్రికి జయము
సృష్టిమీద రెక్కలుచాచు! తండ్రికి జయము
లోకముచేత అన్ని ఒప్పించు! తండ్రికి జయము
తండ్రి చిత్తము జరుపు! దూతలకు జయము
నరులకు కావలియుండు! పరిచారకులకు జయము
రాజ్య సువార్త ప్రకటించు! సభకు జయము
క్రీస్తులో అన్నిచోట్ల! వారికి జయము
తం డ్రికిని కుమారునికిని! పరిశుద్ధాత్మకును జయము
ఇహపరములయందు! శాశ్వతకాలము జయము